‘టీఆర్ఎస్‌లో దేశ ద్రోహుల ఆలోచనలు’

దిశ, క్రైమ్ బ్యూరో: ఎంఐఎంతో స్నేహం కారణంగా టీఆర్ఎస్ పార్టీలో, సీఎం కేసీఆర్‌లో కూడా దేశ ద్రోహుల ఆలోచనలు వస్తున్నాయని గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న తిరంగ్ యాత్ర చేపట్టినందుకు నాపై, మా బీజేపీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నగరంలోని 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. అఫ్జల్‌గంజ్ పీఎస్‌లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో […]

Update: 2021-02-08 11:41 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: ఎంఐఎంతో స్నేహం కారణంగా టీఆర్ఎస్ పార్టీలో, సీఎం కేసీఆర్‌లో కూడా దేశ ద్రోహుల ఆలోచనలు వస్తున్నాయని గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న తిరంగ్ యాత్ర చేపట్టినందుకు నాపై, మా బీజేపీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నగరంలోని 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. అఫ్జల్‌గంజ్ పీఎస్‌లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో జరిగింది. విచారణలో ఎలాంటి ఆధారాలు పోలీసులు చూపలేకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసును కోర్టు కొట్టివేసింది.

ఈ సందర్భంగా రాజాసింగ్ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చెడ్డవారితో సహవాసం చేస్తే చెడు ఆలోచనలు వస్తాయని, అలాగే.. దేశ ద్రోహులైన ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ చేస్తున్నందున టీఆర్ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు దేశ ద్రోహపు ఆలోచనలు పుట్టుకొచ్చి మాపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. ప్రజల మద్దతుతో అఫ్జల్‌గంజ్ పీఎస్ కేసును గెలిచినట్టు తెలిపారు. ఇంకా మరో మూడు కేసులలో కూడా గెలుస్తామని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News