కేటీఆర్,ఈటల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్

దిశ,తెలంగాణ బ్యూరో : కరోనాను నియంత్రించడంలో తెలంగాణ సర్కార్ దారుణంగా విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రులు కేటీఆర్,ఈటెల రాజేందర్​కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్​ఆరోపించారు. గురువారం వీరు వేర్వేరు ప్రకటనల ద్వారా మంత్రులు కేటీఆర్,ఈటల.. కేంద్ర సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం సరిపడా టీకాలను అందించడం లేదని, ఆక్సిజన్ ​సిలిండర్ల కొరత ఉన్నా.. పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఏమైనా విపత్కర పరిస్థితులు తలెత్తితే […]

Update: 2021-04-22 11:13 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : కరోనాను నియంత్రించడంలో తెలంగాణ సర్కార్ దారుణంగా విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రులు కేటీఆర్,ఈటెల రాజేందర్​కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్​ఆరోపించారు. గురువారం వీరు వేర్వేరు ప్రకటనల ద్వారా మంత్రులు కేటీఆర్,ఈటల.. కేంద్ర సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

కేంద్రం సరిపడా టీకాలను అందించడం లేదని, ఆక్సిజన్ ​సిలిండర్ల కొరత ఉన్నా.. పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఏమైనా విపత్కర పరిస్థితులు తలెత్తితే దానికి కేంద్రమే బాధ్యత వహించాలని వారు చేసిన కామెంట్స్‌ను తప్పుపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో వైద్య అవసరాలను అంచనా వేసేందుకు తెలంగాణ సర్కార్ ఒక్కసారి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని డీకే అరుణ అన్నారు. వాస్తవానికి మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు మోడీ ప్రభుత్వం వారం క్రితమే చర్యలు మొదలుపెట్టిందన్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ప్రవేశపెట్టిందన్నారు.

ఆక్సిజన్​ అవసరాలపై రాష్ట్ర సర్కార్‌కు ఓ క్లారిటీ లేదని, తెలంగాణకు ఎన్ని టన్నుల ఆక్సిజన్​ అవసరమో కూడా ప్రభుత్వానికి తెలియదని ఎంపీ అర్వింద్​అన్నారు. ఎన్ని మందులు కావాలన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం లేదన్నారు. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని, ఐసీయూ బెడ్స్ సరిపోవడం లేదని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి ద్వారాలు తెరిచారని విమర్శించారు. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులేత్తిసినట్లు కనిపిస్తోందన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలకి మనోధైర్యం ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మీద నిందలేసి రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర సర్కార్‌పై బట్ట కాల్చి మీద వేస్తుందన్నారు.

 

Tags:    

Similar News