మోసాలు చేయడంలో ఆయనను మించిన వారు లేరు

దిశ,సిద్దిపేట: కరెంట్ మీటర్లు గురించి టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు వివేక్ వెంకట స్వామి అన్నారు. స్కెచ్‌లు వేయడంలో , మోసాలు చేయడంలో హరీశ్ రావును మించిన వారు ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీ గెలిచి టీఆర్ఎస్ పతనానికి నాంది పలకనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని అక్షయ గ్రాండ్ హోటల్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాబు […]

Update: 2020-10-31 10:29 GMT

దిశ,సిద్దిపేట:
కరెంట్ మీటర్లు గురించి టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు వివేక్ వెంకట స్వామి అన్నారు. స్కెచ్‌లు వేయడంలో , మోసాలు చేయడంలో హరీశ్ రావును మించిన వారు ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీ గెలిచి టీఆర్ఎస్ పతనానికి నాంది పలకనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని అక్షయ గ్రాండ్ హోటల్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ తో కలిసి మీడియా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో వివేక్ మాట్లాడుతూ…. టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఉద్యమంలో పనిచేసిన ప్రో,జయ శంకర్, నరేంద్ర ,కోదండ రామ్, కొండా లక్ష్మణ్ ,జితేందర్ లాంటి నాయకులు ఏమయ్యారని కేసీఆర్‌ను హరీశ్ రావు ప్రశ్నించాలని అన్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఎక్కడ ఉన్నారు , తెలంగాణ ఉద్యమ కారులు ఎక్కడ ఉన్నారనేది హరీశ్ రావు ఆలోచించాలని కోరారు. అనంతరం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రం నుండి నయా పైసా కూడా రాలేదన్న హరీశ్ రావు ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. దుబ్బాక ప్రాంతంలోని ప్రజలకు ఎన్ ఆర్ఈజీఎస్ కింద లక్ష కార్డు లు ఉన్నాయని అన్నారు. వారికి పనిలో భాగంగా నేరుగా వారి అకౌంట్‌లో కేంద్రమే డబ్బులను జమ చేయడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం ఎంత వచ్చేది కూడా ఆర్థిక మంత్రిగా హరీశ్ రావుకు అవగాహన లేదన్నారు. ఆ పనిని ఫైనాన్స్ సెక్రటరీ , సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే
బాబు మోహన్ మాట్లాడుతూ…. కొండగల్ లో,నారాయణఖేడ్ ఎన్నికల్లో హరీశ్ రావు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఓటర్లను భయ బ్రాంతులకు గురి చేయడంలో, అబద్ధాలు ఆడటంలో, ప్రొసీడింగ్ కాపీలు చూపెట్టడం లో హరీశ్ రావు దిట్ట అని అన్నారు. మామ కేసీఆర్ నుండి ఆయన వాటిని నేర్చుకున్నారని అన్నారు.

Tags:    

Similar News