సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి: అద్దెలి
దిశ, పటాన్‌చెరు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అదెల్లి రవీందర్ అన్నారు. శనివారం బీరంగూడలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మొదటి నుంచి దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాటలు దళితులను మోసం చేయడానికేన్నారు. అధికారం చేపట్టాక దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు దళితుల భూమి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. దళిత యువ రైతు ఆత్మహత్యకు […]
దిశ, పటాన్‌చెరు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అదెల్లి రవీందర్ అన్నారు. శనివారం బీరంగూడలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మొదటి నుంచి దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాటలు దళితులను మోసం చేయడానికేన్నారు. అధికారం చేపట్టాక దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు దళితుల భూమి తీసుకోవడం సిగ్గుచేటన్నారు.
దళిత యువ రైతు ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. దళిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళిత సోదరులు ఇప్పటికైనా మేల్కొని తెరాస ప్రభుత్వం చేస్తున్న మోసాలు గ్రహించాలన్నారు.