సోనియా, రాహుల్ గాంధీకి వారితో సంబంధం ఉంది

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీకి చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని శుక్రవారం హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చైనాకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని లేఖలో వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనీస్ ఎంబసీ నుంచి విరాళాలు వచ్చాయని.. గతంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల హోదాలో కమల్‌నాథ్ చైనీస్ […]

Update: 2020-07-03 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీకి చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని శుక్రవారం హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చైనాకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని లేఖలో వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనీస్ ఎంబసీ నుంచి విరాళాలు వచ్చాయని.. గతంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల హోదాలో కమల్‌నాథ్ చైనీస్ దిగుమతులపై రిబేటు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ చైనా మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలకు తెలియజేయాలని.. దీనికి సీబీఐ దర్యాప్తు అవసరం అని కమల్ పటేల్ స్పష్టం చేశారు. కాగా, ఇదే వ్యవహారంపై ఇటీవల కేంద్ర మంత్రులు సైతం కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News