జిమ్ ట్రైనర్ తో డాక్టర్ బాబు భార్య రాసలీలలు.. చివరికి నడిరోడ్డుపైనే

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో సంచలనం రేపిన జిమ్ ట్రైనర్‌ విక్రమ్ రాజ్‌పుత్‌ హత్యాయత్నం కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత శనివారం గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై విక్రమ్ పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వివాహేతర సంబంధమే ఈ హత్యాయత్నానికి కారణమని  నిర్దారించారు. కాల్పులు జరిపిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలలోకి వెళితే.. బీహార్ కి చెందిన డాక్టర్ రాజీవ్ […]

Update: 2021-09-24 00:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో సంచలనం రేపిన జిమ్ ట్రైనర్‌ విక్రమ్ రాజ్‌పుత్‌ హత్యాయత్నం కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత శనివారం గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై విక్రమ్ పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వివాహేతర సంబంధమే ఈ హత్యాయత్నానికి కారణమని నిర్దారించారు. కాల్పులు జరిపిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలలోకి వెళితే.. బీహార్ కి చెందిన డాక్టర్ రాజీవ్ అనే వ్యక్తి, భార్య కుష్బూతో కలిసి నివాసముంటున్నాడు. భార్య కుష్బూ భర్తకు తెలియకుండా ఆమె జిమ్ ట్రైనర్ అయిన విక్రమ్ రాజ్‌పుత్‌ తో వివాహేతర సంబంధం పెట్టుకోంది. వీరి సంబంధం ఏడాదిగా కొనసాగుతోంది. ఎన్నోసార్లు విక్రమ్, రాజీవ్ ఇంటికి వస్తూ పోతుండేవాడు. వీరి శారీరక సంబంధం గురించి భర్త రాజీవ్ కి తెలిసింది. దీంతో తన భార్యను వదిలేయాల్సిందిగా రాజీవ్, విక్రమ్ కి వార్నింగ్ ఇచ్చాడు. అయినా విక్రమ్, కుష్బూతో సంబంధం కొనసాగించడంతో కోపోద్రక్తుడైన డాక్టర్ రాజీవ్, జిమ్ ట్రైనర్ విక్రమ్ ని హతమార్చాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు వికాస్ ద్వారా ముగ్గురు వ్యక్తులకు మూడు లక్షలు సుపారి మాట్లాడుకొని విక్రమ్ పై కాల్పులు జరిపించాడు. ఆ ముగ్గురు వ్యక్తులు.. శనివారం ఉదయం విక్రమ్ స్కూటీ పై జిమ్ కి వెళ్తుండగా నడిరోడ్డుపై కాల్పులు జరిపి పరారయ్యారు.

శరీరంలో ఐదు బుల్లెట్లు దిగినా విక్రమ్ బతికి బయటపడ్డాడు. ఇక ఈ కేసు ని సవాల్ గా తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారించారు. డాక్టర్ రాజీవ్ స్నేహితుడు వికాసే తమని పురమాయించాడని, బాధితుడు చనిపోలేదు కాబట్టి తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయారు. ఇక ఈ కేసులో సంబంధం ఉన్నవారందరి ఫోన్ కాల్స్ ని చెక్ చేశామని, జనవరి నెల నుంచి ఇప్పటివరకూ కుష్బూ, విక్రమ్ మధ్య 1100 సార్లు ఫోన్ కాల్స్ నడిచాయి. అన్నీ అర్ధరాత్రి సమయంలో మాట్లాడుకున్న సంభాషణలే కావడం గమనార్హమని పోలీసులు తెలిపారు. అయితే.. ఏప్రిల్ 18న తొలిసారిగా విక్రమ్ నంబర్‌కు కుష్బూ భర్త డాక్టర్ రాజీవ్ నుంచి కాల్ వెళ్లింది. చంపేస్తానని ఫోన్‌లో విక్రమ్‌ను రాజీవ్ బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాలతో ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News