జూన్ 30వరకు లాక్‌డౌన్ పొడిగించిన తమిళనాడు, బీహార్

చెన్నై: లాక్‌డౌన్‌ను జూన్ 30వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతి రోజు తమిళనాడు, బీహార్‌లు అందుకు అనుగుణంగా ప్రకటనలు చేశాయి. తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ జూన్ 30వరకు కొనసాగుతుందని వెల్లడించాయి. కొత్తగా సడలింపులు, ఆంక్షలపై బీహార్ ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. కానీ, తమిళనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాకు పచ్చజెండా ఊపింది. ఆధ్యాత్మిక కేంద్రాలకు, షాపింగ్ మాల్స్‌కు కేంద్రం అనుమతిచ్చింది(జూన్ 8 నుంచి) కానీ, తమిళనాడు సర్కారు మాత్రం నిషేధాన్నే కొనసాగించింది. […]

Update: 2020-05-31 05:31 GMT

చెన్నై: లాక్‌డౌన్‌ను జూన్ 30వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతి రోజు తమిళనాడు, బీహార్‌లు అందుకు అనుగుణంగా ప్రకటనలు చేశాయి. తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ జూన్ 30వరకు కొనసాగుతుందని వెల్లడించాయి. కొత్తగా సడలింపులు, ఆంక్షలపై బీహార్ ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. కానీ, తమిళనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాకు పచ్చజెండా ఊపింది. ఆధ్యాత్మిక కేంద్రాలకు, షాపింగ్ మాల్స్‌కు కేంద్రం అనుమతిచ్చింది(జూన్ 8 నుంచి) కానీ, తమిళనాడు సర్కారు మాత్రం నిషేధాన్నే కొనసాగించింది. చెన్నై, కంచీపురం, తిరువళ్లూర్, చెంగల్‌పేట్ జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల ప్రజా రవాణాకు అనుమతినివ్వలేదు. చెన్నైలో కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.

Tags:    

Similar News