Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ నుంచి ఒకేసారి ముగ్గురు ఔట్.. ? ఉల్టా పుల్టా ట్విస్ట్ అదుర్స్..!

బిగ్ బాస్ సీజన్ 7లో ఈ సారి బిగ్ బాస్ ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇవ్వబోతున్నారు

Update: 2023-09-15 09:26 GMT

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7లో ఈ సారి బిగ్ బాస్ ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. రెండో వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది ఉండగా.. వారిలో ముగుర్ని ఎలిమినేట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఒక వారంలో ముగ్గుర్ని ఎలిమినేట్ చేయడం అంటే బిగ్ బాస్ హిస్టరీలో ఇదే తొలిసారి. అయితే ఈ ఎలిమినేషన్స్‌లో మనం ఊహించలేని ట్విస్ట్‌లు కూడా ఉండబోతున్నాయి. ఒకేసారి ముగ్గుర్ని ఎలా ఎలిమినేట్ ఎలా చేస్తారని వినే వారికి కూడా షాకింగ్ గా ఉంది. ముగ్గురిని ఎలిమినేట్ చేసి వారిలో ఒకరిని ఒకర్ని సీక్రెట్ రూంకి పంపబోతున్నారనేది తెలిసిన సమాచారం. అయితే వీరిలో మన రైతు బిడ్డ కూడా ఉన్నాడట. కొన్ని అన్ అఫీషియల్ పోల్స్‌‌లో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వారం నామినేషన్స్‌‌లో అమర్ దీప్ అండ్ కో సీరియల్ బ్యాచ్ మొత్తం పల్లవి ప్రశాంత్‌ని దూషించారు.

ప్రతి సారి రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పుకోకంటూ హౌస్ మేట్స్ ప్రశాంత్ ని దారుణంగా అవమానించారు. హౌస్లో ఒక్కడిని చేసి ఆడుకుంటుంటే.. జనాలు మొత్తం నీ వెనుక మేము ఉన్నామంటూ రైతు బిడ్డకే సపోర్ట్ చేస్తున్నారు. ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ దూసుకొస్తూ.. ఊహించని రీతిలో సీరియల్ బ్యాచ్‌ని వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లను రాబడుతున్నాడు.

ఇవి కూడా చదవండి : Bigg Boss-7: వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Tags:    

Similar News