‘ఈ షో కేవలం ఆట మాత్రమే’.. దాడుల అనంతరం బిగ్ బాస్ విన్నర్ సుధీర్ఘమైన పోస్ట్

ఉల్టా పుల్టా గేమ్‌తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఘనంగా ముగిసింది.

Update: 2023-12-18 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉల్టా పుల్టా గేమ్‌తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. కామన్ మెన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. అయితే.. ఈ షో ముగియడంతో బయట జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు కొంతమంది అభిమానులు. ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించిన సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ స్పందించాడు.

ఈ మేరకు ‘ఆట అనేది కేవలం ఆట మాత్రమేనని, వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. బిగ్ బాస్ వంటి షోలో ఒకరితో ఒకరు పోటీ పడిన తర్వాత కూడా, కంటెస్టెంట్లు బయటకు వచ్చి స్నేహితులుగా ఉంటారు. గేమ్ గెలవడానికి వివిధ వ్యూహాలు ఉపయోగించాల్సి వస్తుంది. కానీ, అది చివరకు గేమ్‌లో భాగమని గుర్తించాలి. దీన్ని ఎవరూ సీరియస్‌గా పరిగణించకూడదు. ఒక పోటీదారుడి అభిమానులు.. ఇతర పోటీదారులపై భౌతికపరమైన దాడి చేయడం నిరుత్సాహపరుస్తుంది. ఇటువంటి ప్రవర్తన షో ప్రదర్శనకు ప్రతికూలంగా మారుతుంది. ఈ ప్రవర్తన కారణంగా సెలబ్రిటీలను ఈ షోలో పాల్గొనకుండా చేసే ప్రమాదముంది. షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్‌ను వారి జీవితాలలో ముందుకు సాగనివ్వాలి. వీరు భావోద్వేగాలు కలిగిన నిజమైన వ్యక్తులు. కేవలం ఆటలోని పాత్రలు మాత్రమే కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆడియన్స్‌గా మనం వారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవిద్దాం’ అంటూ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ రిలీజ్ చేశాడు కౌశల్.

Full View


Similar News