Bigg Boss 7 Telugu: ఆ మాట వెనక్కి తీసుకో.. అంటూ అమర్ మీద ఫైర్ అయిన నాగార్జున
ఈ సీజన్ ఎంత పేరు సంపాదించుకుందో .. అన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది
దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ షో నెట్టుకొస్తున్నారు.ఈ సీజన్ ఎంత పేరు సంపాదించుకుందో .. అన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక నాగార్జున శని, ఆది వారాలు కనిపించి ఒక్కొక్కరికి సూపర్ క్లాస్ ఇస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో షో హోస్ట్ నాగ్ అమర్ మీద ఫైర్ అయ్యాడు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
శివాజీ నువ్వు అర్జున్‌కి కూడా మాట ఇచ్చానని అమర్‌కి ముందే చెప్పేసి ఉంటే సరిపోయేది కదయ్యా.. ఈ గోల ఉండేది కాదు కదా అన్నాడు. కానీ నువ్వు చివరి నిమిషం వరకు చెప్పలేదు అందుకే ఇది ఇక్కడి వరకూ వచ్చిందని అన్నారు. ఇక అమర్ మాట్లాడుతూ ఇప్పుడు కూడా నాకు అన్న మీద ఎలాంటి కోపం లేదు సార్.. కానీ నాకు విషయం చెప్పలేదు సార్.. చెప్పే ముందు నేను డిజర్వ్ కాదని అన్నారు సార్.. వెళ్లి అర్జున్ అన్నని అడుక్కో అన్నారు.
నాకు ఏమైనా ముష్టి వేస్తున్నారా.. నేను మనస్ఫూర్తిగా అడిగాను సార్.. మా అమ్మ మీద ఒట్టు అంటూ అమర్ అన్నాడు. దీంతో వెంటనే నాగార్జున సీరియస్ అయ్యారు. ఏంటి అమర్ .. ఆ మాట ఏంటి .. అమ్మ మీద ఒట్టు ఏంటి.. ఆ మాటని వెంటనే వెనక్కి తీసుకో.. అంటూ ఫైర్ అయ్యారు. ఓకే సార్ నాకు అలవాటుగా వచ్చేసిందని అని చెప్పగా.. ఆ అలవాట్లు మార్చుకోవడం కోసమే బిగ్ బాస్ లోకి వచ్చావు అని నాగ్ అన్నారు. నీ నిజాయితీ నాకు అర్థమవుతుంది కానీ నువ్వు పాతలో ఒకలా.. ఇప్పడు మరోలా మాట్లాడి, అక్కడేమో అది నా స్ట్రాటజీ అని చెప్పి.. ఇక్కడ ఇదే ఒరిజినాలిటీ అంటే ఆడియన్స్ తప్పుగా అర్ధం చేసుకుంటారని నాగ్ అన్నాడు.