Bigg Boss 7 Telugu: నాగార్జున వేసుకున్న ఎల్లో కలర్ షర్ట్‌.. రేటు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

కొత్త కొత్త చొక్కాలతో అదరగొడుతున్నారు కింగ్ నాగార్జున.

Update: 2023-10-31 05:23 GMT

దిశ,వెబ్ డెస్క్: డబ్బున్నోడు ఏది చేసిన మంచే అంటుంది సమాజం. అదే డబ్బులేనోళ్లు మంచి చేసిన అది తప్పులాగే చూస్తుంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. వేసుకున్న బట్టలు బట్టి వారి విలువేంటో డిసైడ్ చేసేస్తున్నారు. అసలు ఇక్కడ మ్యాటర్‌ ఏంటంటే .. బిగ్ బాస్ హోస్ట్‌గా స్టైలిష్ లుక్‌తో ప్రతి వారం కొత్త కొత్త చొక్కాలతో అదరగొడుతున్నారు కింగ్ నాగార్జున.

అయితే లాస్ట్ వీకెండ్‌లో నాగార్జున.. ఎల్లో కలర్ ప్రింట్ షర్ట్‌లో తళుక్కుమన్నారు. మామూలుగా అయితే.. ఆ షర్ట్ నార్మల్ పీపుల్ వేసుకోవాలంటే.. వామ్మో ఇదేంటి ఇలా ఉంది అని వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు .. కానీ అది కింగ్ వేశాడు కాబట్టి.. భలే కలర్ ఫుల్‌గా అనిపించింది. అయితే ఆ షర్ట్ చూడటానికి అలా ఉంది కానీ.. అల్లా టప్పా షర్ట్ కాదండోయ్.. అది శాండ్రో అనే అమెరికన్ బ్రాండెడ్ షర్ట్. షార్ట్ స్లీవ్ స్టార్ ఫిష్ షర్ట్ అని అంటారు దాన్ని. ఆ షర్ట్ ధర అక్షరాల రూ. 25, 353 రూపాయలు. అంటే పాతిక వేలు పైమాట అన్నమాట. ఈ షర్ట్ రేటు విన్నాక నెటిజెన్స్ .. బాబోయ్ మా లాంటి వాళ్లకి ఒక నెల సాలరీ, వారం వారం మీరు వేసుకున్న షర్ట్ లు మా లాంటి ఇవ్వొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News