టీఆర్పీ రికార్డులు బద్దలు కొట్టిన బిగ్ బాస్-7.. స్టార్‌ మా పోస్ట్ వైరల్

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్-7’ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.

Update: 2023-09-14 15:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్-7’ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. రెండో వారంలో హౌస్ మేట్స్‌తో ఓ ఆట ఆడిస్తున్నాడు బిగ్ బాస్. నాగార్జున చెప్పిన ఉల్టా-పుల్టా గేమ్స్‌తో అదరగొడుతున్నారు హౌస్ మేట్స్. అయితే.. గత సీజన్ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగాలని కొత్త కొత్త రూల్స్ పెట్టారు బిగ్ బాస్. ఇప్పుడు ఈ రియాలిటీ షో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. స్టార్ట్ అయిన రెండు వారాల్లోనే 18.1 సాధించింది అంటూ స్టార్ మా ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ‘‘ బిగ్ బాస్ స్పెక్టాక్యులర్ కమ్ బ్యాక్ ఇచ్చేసింది. ఎలక్ట్రిఫైయింగ్ బ్యాంగ్‌తో లాంచ్ అయిన రియాలిటీ షో.. రికార్డ్స్ స్మాష్ చేసింది. 18.1 టీవీఆర్‌ను అచీవ్ చేసింది’’ అంటూ ట్వీట్ చేసింది.

Tags:    

Similar News