బిగ్‌బాస్-8: రియాలిటీ షోకు రైతు బిడ్డ.. టైటిల్ గెలిచి రావాలంటున్న గ్రామస్తులు

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో సీజన్-8 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Update: 2024-09-04 09:49 GMT

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) రియాలిటీ షో సీజన్-8 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోకు కింగ్ నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇందులో 14 మంది నటీనటులు కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి వెళ్లారు. మొదటి రోజు నుంచే గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో రచ్చ చేస్తున్నారు. అయితే పెద్దపల్లి(Peddapally) జిల్లాకు చెందిన సాదా సీదా అమ్మాయి అయిన సోనియా(Sonia) పలు సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుని ఈ షోకు వెళ్లింది. మొదటి రోజు నుంచే ఆట మొదలెట్టి తన సత్తా చాటుతోంది. తాజాగా, సోషల్ మీడియా ద్వారా మంథని గ్రామస్తులు సోనియా బిగ్‌బాస్ షోలో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేస్తూ కప్ మనదే గెలుచుకొని రావాలంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో.. సోనియాకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మంథని మండలం గాజుల పల్లెకు చెందిన రైతు ఆకుల చక్రపాణి కూతురు సోనియా(Sonia). ఆమె మంథనిలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేయడంతో పాటు బీటెక్ కూడా పూర్తి చేసింది. తెలంగాణ ఉద్యమ కారుడు ప్రశాశ్‌(Prasash)కు పీఏగా పని చేస్తూనే తనకు నచ్చిన యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Ramgopal Verma) తెరకెక్కించిన ‘దిశ’(Disha Movie) సినిమాలో హీరోయిన్‌గా నటించిన సోనియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జార్జిరెడ్డి(George Reddy) సినిమాలో హీరోయిన్‌కు చెల్లిగా నటించి మెప్పించడంతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించి ఏకంగా బిగ్‌బాస్ షోలోకి వెళ్లింది.

దీంతో ఈ విషయం తెలుసుకున్న మంథని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ షో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సోనియాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఆమె కంటెస్టెంట్‌గా వెళ్లడంపై ఆర్జీవీ(RGV) కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ వీడియోను నాగార్జున స్టేజి మీద ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏమన్నారంటే.. నటనలో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావ్. ఇప్పుడు హౌస్‌లో కూడా నీ టాలెంట్ చూపిస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావ్, త్వరగా గెలిచి వచ్చేయ్ మనం పార్టీ చేసుకుందాం అన్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో సోనియా పేరు మార్మోగిపోతోంది.

Tags:    

Similar News