హౌస్ మేట్స్ తలలు పగులగొట్టిన నాగార్జున.. కంటెస్టెంట్స్ అందరూ సేఫ్!
బిగ్ బాస్ 7 సీజన్ 11వ వారం చివరి దశకు చేరుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ 7 సీజన్ 11వ వారం చివరి దశకు చేరుకుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌస్ మేట్స్ చేసిన తప్పొప్పుల గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడారు. అయితే.. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో సరైన కారణాలు చెప్పి కంటెస్టెంట్స్ తలపై బాటిల్ పగులగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నాగార్జున కూడా బాటిల్స్‌తో వీకెండ్ ఎపిసోడ్లో వీరంగం సృష్టించాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎవరెవరు ఏమేం తప్పులు చేశారు అనేవి మాట్లాడుతూ వారి ఫొటోలపై బాటిల్స్ పగలగొట్టాడు.
మొదటగా శివాజీ గురించి మాట్లాడుతూ.. నాకు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయంటూ స్టార్ట్ చేస్తూ ఆయన వల్గర్ మాటలు గురించి ఫైర్ అయ్యాడు నాగ్. ఇక రతిక ప్రతి వారం చెప్పుకొస్తున్నట్లు ‘నెక్స్ట్ వీక్ నేనేంటో చూపిస్తా’ నేనేంటో చూపిస్తా అంటున్నావ్ కానీ ఏం లేదు. ఇక నుంచి అలాంటి మాటలు బ్యాన్ చెయ్యి అంటూ రతిక గేమింగ్ విధానానికి చురకలు అంటించాడు. ఇక అమర్, గౌతమ్, పల్లవి ప్రశాంత్ ఆట తీరు గురించి కూడా ఫైర్ అయ్యాడు నాగార్జున. మొత్తానికి ఈ వారం ఆడియన్స్‌కు కావాల్సినంత మసాలా అయితే అందిందని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. కాగా, ఈ వారం ఏ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాలేదు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ సైతం సేఫ్ అయ్యారు.