Bigg Boss-7: అర్జున్ రెడ్డిలా రెచ్చిపోయిన అమర్.. శోభను కెప్టెన్ చేసేందుకు వీరంగం
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కెప్టేన్సీ టాస్క్ నడుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కెప్టేన్సీ టాస్క్ నడుస్తోంది. హౌస్ మేట్స్‌ను (వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు) రెండు టీమ్లుగ డివైడ్ చేశాడు. ఇక ఈ వారం జరిగిన గేమ్‌లో వీర సింహాలు టీమ్ గెలవడంతో వారు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. దీంతో కప్టెన్ను సెలక్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. అయితే.. ఈ టాస్క్‌లో వీర సింహాలు టీమ్ సభ్యల తరఫున గర్జించే పులుల టీమ్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఆ టీమ్ కంటెండర్లకు సంబంధించిన బీమ్ బ్యాగ్‌ను ఆపోజిట్ టీమ్‌లో సభ్యులు తగిలించుకుంటారు. ఇక ఇందులో ఒక్కో రౌండ్ ముగిసేసరికి ఎవరి సంచి తక్కువగా ఉంటే వారు కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు.
ఇందులో భాగంగా.. శోభ శెట్టి బీమ్ బ్యాగ్‌ను అమర్ దీప్ తగిలించుకుంటాడు. ఇక గేమ్ మొదలు కాగానే.. అసలు అమర్ బయటకు వస్తాడు అన్న మాట. ఒక్కొక్క కంటెండర్పై విరుచుకు పడుతూ ఆల్మోస్ట్ పిచ్చిపట్టినట్లుగా బిహేవ్ చేస్తాడు. బోలే, అశ్విని ఇలా వరుస పెట్టి రేసులో ఉన్నవాళ్లని ఒక్కొక్కరిని బయటకు తోసేశాడు. శివాజీ చెయ్యి బాగోలేదని కూడా చూడకుండా అతని బ్యాగ్ లాగడంతో.. ఆయనకు చెయ్యి నొప్పి రావడంతో శివాజీ వెనక్కి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని మెడికల్ ఎమర్జెన్సీ కోసం తీసుకెళ్లారు. ఇక చివరికి అమర్ మిగలడంతో ఈ వారం కెప్టెన్ శోభా అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.