శివాజీ కాళ్లు మొక్కింది అందుకే.. అమర్ భార్య షాకింగ్స్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా గేమ్ షోలతో హౌస్ మేట్స్‌కు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆడియన్స్‌కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది. ఇదిలా ఉంటే.. 10 వారంలో ఫ్యామీలీ వీక్‌తో కంటెస్టెంట్స్‌తో సహా.. ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టకునేలా చేశాడు బిగ్ బాస్. ఇక హౌస్‌లో ప్రతీ కంటెస్టెంట్స్‌కు సంబంధించిన వారు ఇంట్లోకి రావడంతో.. ఒక్కొక్కరికి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ఈ క్రమంలోనే అమర్ భార్య తేజస్విని కూడా హౌస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు తేజు శివాజీ కాళ్లు మొక్కింది. అయితే తను ఇంటిలోకి వెళ్లిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆయన కాళ్లు ఎందుకుమొక్కాను అనే విషయాల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది తేజస్విని.
‘అమర్ అమర్‌లాగా ఉన్నాడు. బయట ఎలా ఉండేవాడు ఇప్పడు అక్కడ కూడా అలాగే ఉన్నాడు. ఎలాంటి ఫిల్టర్స్ లేవు. అమర్‌ని అర్థం చేసుకుంటే తాను అంత మంచి వాడు ఎవరు ఉండరు. తనలో అతి మంచితనం ఎక్కువ. దీని వల్ల హౌస్‌లో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఫస్ట్ వారాల్లో గేమ్‌లో డల్ అయినప్పటికీ ఇప్పుడు గాడిలో పడ్డాడు. తనను తాను మార్చుకున్నాడు. అమర్ కచ్చితంగా కప్ తోనే వస్తాడు. బయట కూడా అదే టాక్. వీడు పనికి రాడు అన్నవాళ్లే ఇప్పుడు అతనే విన్నర్ అంటున్నారు. అమర్ కప్పు గెలిచిన గెలవక పోయినా.. నా దృష్టిలో గెలిచినట్టే. అమర్ కెప్టెన్స్ కోసం ఏడ్చాడంటే.. పెయిన్‌తోనే.. సింపథీతో కాదు.. మన అనుకున్న వాళ్లే అమర్‌ని దెబ్బకొట్టారు. బయట కూడా అమర్‌కి అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.
ఆ బాధ ఎలా ఉంటుందో నేను చూశాను. అదే బాధ హౌస్‌లో పడ్డాడు. కెప్టెన్‌గా చివరి ఛాన్స్ కాబట్టే అమర్ అంతలా ఏడ్చాడు. అంతే కానీ సింపథీతో కాదు. శివాజీ కాళ్లు మొక్కాను అని కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు. నేను హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడ జరిగింది వేరు. శివాజీ అమర్‌ని అన్న మాటలకు నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత శివాజీ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు.. మాట్లాడారు. అంత ప్రేమ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన నుంచి. ఇక అమర్ నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. నేను శివాజీ బ్లెసింగ్స్ తీసుకోవడాన్ని ట్రోల్స్ చేశారు. ఇక లాస్ట్ వీక్ అమర్‌ని శివాజీ కావాలనే కెప్టెన్ కాకుండా ఆపారని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.