ముద్దు వివాదంపై సల్మాన్ సీరియస్.. అతనొక ఇడియట్‌ అంటూ..

దిశ, సినిమా : సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్‌15’కు సంబంధించి తాజాగా ఓ ముద్దు సన్నివేశం పెద్ద గొడవకు దారితీసింది. గతవారం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ టైమ్‌లో దేవొలీనా భట్టాచార్జీని తన చెంపపై ముద్దు పెట్టమని అభిజిత్ బిచుకలే అడగడంతో షోలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత వీడియో ఫుటేజీని ఇతర పోటీదారులకు చూపించిన సల్మాన్.. అభిజిత్ చేసింది తప్పు అయినపుడు ముద్దు అడిగిన వెంటనే ఎందుకు స్పందించలేదని దేవొలీనాను ప్రశ్నించాడు. […]

Update: 2021-12-19 06:24 GMT

దిశ, సినిమా : సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్‌15’కు సంబంధించి తాజాగా ఓ ముద్దు సన్నివేశం పెద్ద గొడవకు దారితీసింది. గతవారం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ టైమ్‌లో దేవొలీనా భట్టాచార్జీని తన చెంపపై ముద్దు పెట్టమని అభిజిత్ బిచుకలే అడగడంతో షోలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత వీడియో ఫుటేజీని ఇతర పోటీదారులకు చూపించిన సల్మాన్.. అభిజిత్ చేసింది తప్పు అయినపుడు ముద్దు అడిగిన వెంటనే ఎందుకు స్పందించలేదని దేవొలీనాను ప్రశ్నించాడు. అయితే తను టాస్క్‌లో భాగంగానే సరదాగా మాట్లాడుతున్నట్లు భావించానే తప్ప ఫిర్యాదు చేయడం తన ఉద్దేశ్యం కాదని దేవొలీనా రిప్లయ్ ఇచ్చింది.

ఇంతలో కలగజేసుకున్న మరో కంటెస్టెంట్ తేజస్వి.. అమ్మాయిలు అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఎలా స్పందించాలో వారికే తెలియదని చెప్పింది. దీంతో ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారో మీరెలా నిర్ణయిస్తారంటూ సల్మాన్ ఫైర్ అయ్యాడు. అభిజిత్ చేసిన పనిని తాను ఏ విధంగానూ సమర్థించడం లేదని, అతనొక ఇడియట్ అని తేల్చేస్తూ వివాదానికి ముగింపు పలికాడు.

Tags:    

Similar News