మరోసారి మార్కెట్లలో ఐపీఓల జోరు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి ఐపీఓల జోరు కొనసాగనుంది. నవంబర్ నెలలో మొదటి 15 రోజుల్లోగా ఐదు సంస్థలు భారీగా నిధులను సమీకరించనున్నాయి. వాటిలో డిజిటల్ సేవల సంస్థ పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కంప్యూనికేషన్స్‌తో పాటు కేఎఫ్‌సీలను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ ఇండియా, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్, సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్ కలిసి రూ. 27,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. ఇవి కాకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి ఐపీఓల జోరు కొనసాగనుంది. నవంబర్ నెలలో మొదటి 15 రోజుల్లోగా ఐదు సంస్థలు భారీగా నిధులను సమీకరించనున్నాయి. వాటిలో డిజిటల్ సేవల సంస్థ పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కంప్యూనికేషన్స్‌తో పాటు కేఎఫ్‌సీలను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ ఇండియా, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్, సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్ కలిసి రూ. 27,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి.
ఇవి కాకుండా ఇప్పటికే ఆన్‌లైన్ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓలు కొనసాగుతున్నాయి. వీటిలో నైకా రూ. 5,352 కోట్ల సమీకరణకు సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 1న ముగుస్తుంది. ఫినో పేమెంట్స్ రూ. 1,200 కోట్ల కోసం సబ్‌స్క్రిప్షన్ 2న ముగుస్తుంది. దీంతో మొత్తం ఈ ఏడు కంపెనీల మొత్తం రూ. 33,500 కోట్లుగా ఉండనుంది. వీటిలో ఎక్కువ భాగం టెక్నాలజీ ఆధారిత కంపెనీలే పొందనుండటం గమనార్హం. భారీ ఎత్తున దేశీయ కంపెనీలు ఐపీఓలకు సిద్ధమవుతున్న ఈ ఏడాదిలో మొత్తం రూ. లక్ష కోట్ల నిధుల సమీకరణ జరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ఇప్పటివరకు 41 కంపెనీలు ఐపీఓల ద్వారా మొత్తం రూ. 66,915 కొట్లను సమీకరించడం విశేషం.