‘ఆర్టీసీని అమ్మేస్తారు.. బాజిరెడ్డి గోవర్దన్‌తో ప్రయోజనం లేదు’

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా అంటూ మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉందని, కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేస్తూ.. ఈ సమస్యలపై నూతన చైర్మన్ ఏ విధమైన ప్రణాళిక తీసుకుంటారని సందేహం వ్యక్తం చేశారు. ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని బాజిరెడ్డి గోవర్దన్‌ […]

Update: 2021-09-21 10:59 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా అంటూ మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉందని, కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేస్తూ.. ఈ సమస్యలపై నూతన చైర్మన్ ఏ విధమైన ప్రణాళిక తీసుకుంటారని సందేహం వ్యక్తం చేశారు. ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని బాజిరెడ్డి గోవర్దన్‌ ఫ్లెక్సీలు ఒక్కసారిగా నిజామాబాద్, హైదరాబాద్, తెలంగాణ అంతటా వెలిశాయన్నారు. బాజిరెడ్డి గోవర్దన్‌ చైర్మన్ కావడంతో ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళ్లి.. ఏకంగా అమ్మే పరిస్థితి వస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసంఘాలు అప్రమత్తంగా ఉండాలని భూపతి రెడ్డి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జీ, తాహెర్బిన్ హందాన్, నిజామాబాద్ పీసీసీ సెక్రటరీ గడుగు గంగాధర్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News