మార్చి తర్వాత కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ: రెగ్యులేటరీ అనుమతులు పొందితే వచ్చే ఏడాది మార్చి తర్వాత కోవాక్సిన్ టీకాను ప్రవేశపెట్టే అవకాశముందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతమైతే దేశవ్యాప్తంగా మూడో దశ ప్రయోగాలపై దృష్టి నిలిపామని వివరించింది. ఈ మూడో దశ ట్రయల్స్‌లోనూ తాము అభివృద్ధి చేస్తున్న టీకా సామర్థ్యాన్ని, సేఫ్టీకి సంబంధించిన సమాచారాన్ని విజయవంతంగా క్రోడీకరించాక రెగ్యులేటరీ సంస్థ అనుమతిస్తే వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో టీకాను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. డీసీజీఐ నుంచి అనుమతులు పొందారని, త్వరలోనే […]

Update: 2020-11-01 11:36 GMT

న్యూఢిల్లీ: రెగ్యులేటరీ అనుమతులు పొందితే వచ్చే ఏడాది మార్చి తర్వాత కోవాక్సిన్ టీకాను ప్రవేశపెట్టే అవకాశముందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతమైతే దేశవ్యాప్తంగా మూడో దశ ప్రయోగాలపై దృష్టి నిలిపామని వివరించింది. ఈ మూడో దశ ట్రయల్స్‌లోనూ తాము అభివృద్ధి చేస్తున్న టీకా సామర్థ్యాన్ని, సేఫ్టీకి సంబంధించిన సమాచారాన్ని విజయవంతంగా క్రోడీకరించాక రెగ్యులేటరీ సంస్థ అనుమతిస్తే వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో టీకాను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.

డీసీజీఐ నుంచి అనుమతులు పొందారని, త్వరలోనే 13-14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 సైట్‌లలో మూడో దశ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధికి, ఉత్పత్తికి సదుపాయాలకు తాము రూ. 350 నుంచి 400 కోట్లు పెడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, తమ టీకా విజయవంతమైతే ప్రభుత్వం, ప్రైవేట్ మార్కెట్‌కూ పంపిణీ చేయడానికి యోచిస్తున్నట్టు వివరించారు. కోవాక్సిన్ టీకాను భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్‌ఐవీలతో కలిసి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News