ఇక సహించం.. గ్రామాభివృద్ధి కమిటీలకు ఏఎస్పీ వార్నింగ్
దిశ, లోకేశ్వరం: గ్రామాభివృద్ధి కమిటీలు అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా జరిమానాలు విధిస్తే సహించేది లేదని నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ ప్రభాకర్ కిరణ్ కారే హెచ్చరించారు. సోమవారం లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామస్తులతో ఏఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగ్గా.. గ్రామాభివృద్ధి కమిటీలు పలువురికి జరిమానాలు విధించి, గ్రామ బహిష్కరణ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని వార్నింగ్ […]
దిశ, లోకేశ్వరం: గ్రామాభివృద్ధి కమిటీలు అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా జరిమానాలు విధిస్తే సహించేది లేదని నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ ప్రభాకర్ కిరణ్ కారే హెచ్చరించారు. సోమవారం లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామస్తులతో ఏఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగ్గా.. గ్రామాభివృద్ధి కమిటీలు పలువురికి జరిమానాలు విధించి, గ్రామ బహిష్కరణ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇకనుంచి ఏ గ్రామంలో అభివృద్ధి కమిటీలు ఉండకూడదని, అన్నింటిని రద్దు చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీతో పాటు ముధోల్ సీఐ అజయ్ బాబు, లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.