టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటి కూతురు

దిశ, సినిమా: ‘ప్రేమ పావురాలు’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి భాగ్యశ్రీ చాలాకాలం తర్వాత మళ్లీ ‘రాధేశ్యామ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇదే క్రమంలోనే తన కూతురు అవంతికను కూడా టాలీవుడ్‌కు పరిచయం చేసే పనిలో ఉందని సమాచారం. బెల్లంకొండ గణేశ్‌ హీరోగా సతీశ్‌ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రంలో అవంతిక కథానాయికగా ఎంపికైనట్లు టాక్ నడుస్తుంది. ఈ మేరకు త్వరలోనే ఆమె మూవీ సెట్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఇక స్టార్ నటి భాగ్యశ్రీ […]

Update: 2021-11-11 09:09 GMT
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటి కూతురు
  • whatsapp icon

దిశ, సినిమా: ‘ప్రేమ పావురాలు’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి భాగ్యశ్రీ చాలాకాలం తర్వాత మళ్లీ ‘రాధేశ్యామ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇదే క్రమంలోనే తన కూతురు అవంతికను కూడా టాలీవుడ్‌కు పరిచయం చేసే పనిలో ఉందని సమాచారం. బెల్లంకొండ గణేశ్‌ హీరోగా సతీశ్‌ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రంలో అవంతిక కథానాయికగా ఎంపికైనట్లు టాక్ నడుస్తుంది. ఈ మేరకు త్వరలోనే ఆమె మూవీ సెట్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఇక స్టార్ నటి భాగ్యశ్రీ ‘రాధేశ్యామ్’తో పాటు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News