సీఎం మమతా బెనర్జీకి గవర్నర్ వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ వార్నింగ్‌ ఇచ్చారు. శుక్రవారం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగింది. అయితే దీనిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ… బీజేపీ ర్యాలీలో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్​పై దాడి చేయించారని మమతా బెనర్జీ ఆరోపించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ ధనకర్ స్పందించారు. […]

Update: 2020-12-11 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ వార్నింగ్‌ ఇచ్చారు. శుక్రవారం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగింది. అయితే దీనిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ… బీజేపీ ర్యాలీలో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్​పై దాడి చేయించారని మమతా బెనర్జీ ఆరోపించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ ధనకర్ స్పందించారు. దాడి ఘటనపై మమత చేసిన కామెంట్లకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలా స్పందించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. అంతేగాకుండా బెంగాల్‌లో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. కాగా బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో జేపీ నడ్డా ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగింది. అయితే ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారని బీజేపీ ఆరోపించింది.

Tags:    

Similar News