అడ్డంగా బుక్కయిన బేగంబజార్ వ్యాపారులు

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ సిగ‌రెట్ల‌ు అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకుని నగరంలో భారీ ధ‌ర‌ల‌కు అమ్ముతున్న 5గురు స‌భ్యుల ముఠాను హైద‌రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాయ‌త్ గంజ్ వ‌ద్ద అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటికి పైగా విలువైన విదేశీ సిగ‌రెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా స‌భ్యులు బేగంబ‌జార్ కు చెందిన వ్యాపారి విపుల్ రంకా, జ‌గ‌దీష్ కుమార్(చ‌క్నావాడి), ఫ‌ర్ఫ్యూమ్ వ్యాపారి శ్రీమాల్(అఫ్జ‌ల్ గంజ్), స‌ర్నా ట్రాన్స్‌పోర్టు ఉద్యోగి ప‌వ‌న్ కుమార్‌(గోషామ‌హ‌ల్), ఎంఏ హ‌నీఫ్‌(డెలివ‌రీ ఏజెంట్)గా […]

Update: 2020-07-03 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ సిగ‌రెట్ల‌ు అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకుని నగరంలో భారీ ధ‌ర‌ల‌కు అమ్ముతున్న 5గురు స‌భ్యుల ముఠాను హైద‌రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాయ‌త్ గంజ్ వ‌ద్ద అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటికి పైగా విలువైన విదేశీ సిగ‌రెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా స‌భ్యులు బేగంబ‌జార్ కు చెందిన వ్యాపారి విపుల్ రంకా, జ‌గ‌దీష్ కుమార్(చ‌క్నావాడి), ఫ‌ర్ఫ్యూమ్ వ్యాపారి శ్రీమాల్(అఫ్జ‌ల్ గంజ్), స‌ర్నా ట్రాన్స్‌పోర్టు ఉద్యోగి ప‌వ‌న్ కుమార్‌(గోషామ‌హ‌ల్), ఎంఏ హ‌నీఫ్‌(డెలివ‌రీ ఏజెంట్)గా పోలీసులు గుర్తించారు. స‌ర్నా ట్రాన్స్‌పోర్టు యజమాని ర‌వీంద‌ర్ సింగ్ ప్రస్తుతం ప‌రారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

విపుల్ రంకా ఇదివరకు తాను నడిపిన వ్యాపారంలో బాగా న‌ష్ట‌పోయాడు. దీంతో విదేశీ సిగ‌రెట్ల‌ను దిగుమ‌తి చేసుకుని, భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యించి మోసాల‌కు పాల్ప‌డుతున్నాడు. ఒక్కో వ్యాపారికి ఒక్కో రేటుకు సిగ‌రెట్ల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విదేశీ సిగ‌రెట్ల‌ను చైనా, మ‌లేషియా, స్విట్జ‌ర్లాండ్, ద‌క్షిణ కొరియా నుంచి అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News