బ్రేకింగ్.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆరు స్థానాలకు గాను పోటీలో 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి […]

Update: 2021-12-09 21:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆరు స్థానాలకు గాను పోటీలో 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

Tags:    

Similar News