హాలీవుడ్‌కు చెక్కేయనున్న ధనుష్.. కోలీవుడ్ ప్రాజెక్టుల స్పీడప్?

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరికొద్ది రోజుల్లో లాస్ ఏంజిల్స్‌కు పయనం కానున్నారు. తన సెకండ్ హాలీవుడ్ పిక్చర్ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ సినిమా కోసం ధనుష్ దాదాపు రెండు నెలల పాటు అక్కడే స్పెండ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తను కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో పడ్డాడు ధనుష్. ఈ క్రమంలోనే ‘కర్ణన్’ డబ్బింగ్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మారి సెల్వరాజ్ […]

Update: 2021-02-09 03:32 GMT
హాలీవుడ్‌కు చెక్కేయనున్న ధనుష్.. కోలీవుడ్ ప్రాజెక్టుల స్పీడప్?
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరికొద్ది రోజుల్లో లాస్ ఏంజిల్స్‌కు పయనం కానున్నారు. తన సెకండ్ హాలీవుడ్ పిక్చర్ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ సినిమా కోసం ధనుష్ దాదాపు రెండు నెలల పాటు అక్కడే స్పెండ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తను కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో పడ్డాడు ధనుష్. ఈ క్రమంలోనే ‘కర్ణన్’ డబ్బింగ్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుండగా.. థియేట్రికల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేసింది. మరో వైపు #D43 సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ మధ్యే మొదలుకాగా, హీరోయిన్ మాళవిక మోహనన్ ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కాగా రుసో బ్రదర్స్ దర్శకత్వంలో వస్తున్న ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో క్రిస్ ఇవన్స్, ర్యాన్ గ్లోసింగ్, అనా దె అర్మస్‌ లాంటి స్టార్స్‌తో కలిసి నటించబోతున్నారు ధనుష్. ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ధనుష్ క్యారెక్టర్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News