వారి కోసం ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ వారం రోజుల ముందుగానే ముగించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో ఇండియా లేదా ఆస్ట్రేలియా జట్లు తలపడే అవకాశం ఉన్నది. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఐపీఎల్‌లో కీలకంగా ఉన్నారు. న్యూజీలాండ్ ఆటగాళ్లు కూడా పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూన్ 18 నుంచి లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్ తేదీల్లో […]
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ వారం రోజుల ముందుగానే ముగించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో ఇండియా లేదా ఆస్ట్రేలియా జట్లు తలపడే అవకాశం ఉన్నది. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఐపీఎల్‌లో కీలకంగా ఉన్నారు. న్యూజీలాండ్ ఆటగాళ్లు కూడా పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జూన్ 18 నుంచి లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్ తేదీల్లో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. అధికారికంగా ఇంకా నిర్ణయించకపోయినా జూన్ 6న ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నది.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో వారం ముందుగా.. అంటే మే 30నే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తున్నది. జూన్ 2 నుంచి న్యూజీలాండ్, ఇంగ్లాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు ప్రారంభం కానుంది. బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టో, కేన్ విలియమ్‌సన్ అందుబాటులో ఉండాల్సి ఉంది. దీంతో వారం ముందుకు జరిపితేనే అందరు క్రికెటర్లు అందుబాటులో ఉంటారని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం.