గుడ్ న్యూస్ చెప్పిన BCCI.. ఇకపై టీమ్ ఇండియాలో కుడా అది పాటించాల్సిందే..
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లు ఏడాదంతా తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నారు. మిగతా జట్లతో పోలిస్తే టీమ్ ఇండియా క్రికెటర్లు జాతీయ జట్టు తరపునే కాకుండా ఐపీఎల్ కూడా ఆడుతూ అలసిపోతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు అలసటే కారణం అనే వ్యాఖ్యలు వినిపించాయి. బయోబబుల్స్‌లో ఉండటం వలన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసి పోతున్నామని జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేశారు. అవిశ్రాంతంగా క్రికెట్ […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లు ఏడాదంతా తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నారు. మిగతా జట్లతో పోలిస్తే టీమ్ ఇండియా క్రికెటర్లు జాతీయ జట్టు తరపునే కాకుండా ఐపీఎల్ కూడా ఆడుతూ అలసిపోతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు అలసటే కారణం అనే వ్యాఖ్యలు వినిపించాయి. బయోబబుల్స్‌లో ఉండటం వలన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసి పోతున్నామని జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేశారు. అవిశ్రాంతంగా క్రికెట్ ఆడటం వల్ల తమ సామర్థ్యాలపై ప్రభావం చూపుతున్నదని కొంత మంది సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరుగనున్న న్యూజీలాండ్ సిరీస్‌లో పలువురు క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.
అంతే కాకుండా ఇకపై టీమ్ ఇండియాలో రొటేషన్ పాలసీ అమలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రొటేషన్ పాలసీని అమలు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నది. వరుసగా సిరీస్‌లు ఆడించకుండా.. కొంత మందికి విశ్రాంతిని కల్పించడం ద్వారా ఆటగాళ్లు కూడా మానసికంగా ధృఢంగా ఉంటారని బోర్డు భావిస్తున్నది. రాబోయే రెండేళ్లలో టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉన్నాయి.
ఈ పాలసీని దక్షిణాఫ్రికా సిరీస్ నుంచే అమలు చేయడానికి బోర్డు సిద్దపడుతున్నది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కివీస్ సిరీస్ నుంచి రొటేషన్ పాలసీ అమలులో ఉన్నది. టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వగా.. టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించింది. ఇక బుమ్రా, షమి, పంత్‌లను మొత్తం కివీస్ సిరీస్‌కే దూరం పెట్టింది. ఇదే పద్దతిని రాబోయే రోజుల్లో అమలు చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. దీని వల్ల యువ క్రికెటర్లకు కూడా అవకాశాలు మెరుగవుతాయని బోర్డు భావిస్తున్నది.