అక్కడ తెలుగువారి పట్ల వివక్ష..

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది క్రీడాభిమానులు ఇష్టపడే ఆట క్రికెట్. మ్యాచ్ ఉందంటే చాలు ఎంత బిజీ పనిఉన్న అందరూ టీవీలకు అతుక్కుపోతారు. వరల్డ్ కప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నమెంట్ ఉందంటే ఇక అభిమానులకు పండగే. అంతేగాకుండా దాయాది దేశం అయిన పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంటే తలమీదకు వచ్చిన పనినైనా వదులుకుని టీవీల ఎదుట సందడి సందడి చేస్తుంటారు. అలాంటి క్రికెట్‌లో తెలుగు క్రీడాకారులకు ఎన్నో ఏళ్లుగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. వీవీఎస్ లక్ష్మణ్ […]

Update: 2020-10-25 00:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది క్రీడాభిమానులు ఇష్టపడే ఆట క్రికెట్. మ్యాచ్ ఉందంటే చాలు ఎంత బిజీ పనిఉన్న అందరూ టీవీలకు అతుక్కుపోతారు. వరల్డ్ కప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నమెంట్ ఉందంటే ఇక అభిమానులకు పండగే. అంతేగాకుండా దాయాది దేశం అయిన పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంటే తలమీదకు వచ్చిన పనినైనా వదులుకుని టీవీల ఎదుట సందడి సందడి చేస్తుంటారు. అలాంటి క్రికెట్‌లో తెలుగు క్రీడాకారులకు ఎన్నో ఏళ్లుగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఇండియా టీమ్‌లోకి పూర్తిస్థాయి ఆటగాడిని ఒక్కరిని కూడా బీసీసీఐ సెలెక్ట్ చేయలేదు. నైపుణ్యం కలిగిన వారికి అన్యాయం జరుగుతోందనే వాదన ఇటీవలి కాలంలో ఎక్కువ చర్చనీయాంశమవుతోంది.

కాగా ఇటీవల ప్రముఖ తెలుగు క్రీడాకారుడు, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్‌మెన్ అంబటి రాయుడు తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాయుడు రిటైర్మెంట్ అనంతరం సోషల్ మీడియాతో పాటు దినపత్రికల్లో కూడా వార్తలు, స్టోరీలు హల్ చల్ చేశాయి. బీసీసీఐలో రాయుడుకి తీవ్ర అన్యాయం జరిగిందని, అద్భుతమైన ఆటగాడి పట్ల బీసీసీఐ వివక్ష చూపించని ఎక్కువగా చర్చ జరిగింది. అంతేగాకుండా రాయుడిని టీమ్‌లోకి రానివ్వకుండా కొందరు, అప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్లు అడ్డుకున్నట్టు కూడా వార్తలు ట్రోల్ అయ్యాయి.

భారత జట్టులోకి 2013లో ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు. కెరీర్‌ మొత్తంలో 55 వన్డే మ్యాచ్‌లాడి.. మూడు శతకాలు, 10 అర్ధశతకాలు సాధించి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 2019 వరల్డ్ కప్‌లో నిజానికి తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ స్థానంలో రాయుడిని సెలెక్ట్ చేయాలి. కానీ చేయలేదు. అనంతరం విజయశంకర్ గాయపడగా, ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని కాకుండా ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్‌ను ఇంగ్లండ్‌కు రప్పించారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన రాయుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్న రాయుడు, తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)కి లేఖ రాశాడు. రాయుడి నిర్ణయానికి హెచ్‌సీఏ నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది. రిటైర్మెంట్ ప్రకటించిన 58 రోజుల్లోనే ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాగా, ఇప్పుడైనా తనను టీమిండియా జట్టులోకి తీసుకుంటారో లేడా, మళ్లీ తెలుగు ఆటగాళ్ల పట్ల వివక్ష చూపుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News