ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. IPL 2021 New Schedule

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఐపీఎల్ 2021 ( IPL 2021 ) అర్దాంతరంగా వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్‌లు చూసే అదృష్టం లేకుండా పోయింది. దేశమంతటా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌కు తోడు వేసవి కాలం కావడంతో ఇంట్లో కూర్చొని మ్యాచ్‌లు చూడాలని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది. భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో సిరీస్ ఉన్నా అవన్నీ టెస్టు మ్యాచ్‌లే కావడంతో వాటిని వీక్షించే వారి సంఖ్య […]

Update: 2021-06-07 04:10 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఐపీఎల్ 2021 ( IPL 2021 ) అర్దాంతరంగా వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్‌లు చూసే అదృష్టం లేకుండా పోయింది. దేశమంతటా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌కు తోడు వేసవి కాలం కావడంతో ఇంట్లో కూర్చొని మ్యాచ్‌లు చూడాలని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది. భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో సిరీస్ ఉన్నా అవన్నీ టెస్టు మ్యాచ్‌లే కావడంతో వాటిని వీక్షించే వారి సంఖ్య తక్కువ. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఆసక్తిగా చూసినా.. ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కాగా, ధనాధన్ క్రికెట్ చూసే వారికి త్వరలోనే పండుగ మొదలు కాబోతున్నది. జులై నెలలో టీమ్ ఇండియా బి జట్టు శ్రీలంక పర్యటన ఖరారైంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్నది. జులైలో శ్రీలంక పర్యటన ముగిసిన అనంతరం.. అగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ జరుగనున్నది. అనంతరం యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహిస్తారు.

శ్రీలంక పర్యటన ఖరారు..

ఇండియా బి టీమ్ జులై నెలలో శ్రీలంక పర్యటనను ఖరారు చేస్తూ బ్రాడ్‌కాస్టర్ సోనీ పిక్చర్స్ ట్విట్టర్‌లో షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టెస్టులు ఆడనున్నారు. జులై 13, 16, 18న వన్డేలు, జులై 21, 23, 25న టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో మ్యాచ్‌లు అన్నీ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులోగా శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఇండియా బి జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సీనియర్ అయిన ధావన్.. గతంలో ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేపట్టిన అనుభవం ఉన్నది. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకొని అందుబాటులో ఉంటే అతడికే కెప్టెన్సీ అప్పగించే వారని.. కానీ ఆ అవకాశం లేనట్లు తెలుస్తున్నది. అందుకే ధావన్‌కు అవకాశం దొరుకుతుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్, అతడి బృందం కోచింగ్ స్టాఫ్ బాధ్యతలు తీసుకోనున్నారు. రాహుల్ ద్రవిడ్ 2014లో ఇంగ్లాండ్ టూర్‌కు టీమ్ ఇండియా వెంట బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వెళ్లారు. ఏడేళ్ల తర్వాత తిరిగి భారత సీనియర్ జట్టుకు అతడు సేవలు అందించబోతున్నాడు.

ఐపీఎల్ కూడా ఫిక్స్..

గత నాలుగు రోజులుగా యూఏఈలో ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, ఇతర ఆఫీస్ బేరర్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చలు జరిపారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ నిర్వహణకు ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 25 రోజుల్లో ఐపీఎల్ ముగించేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. కాగా,అక్టోబర్ 15న ఫైనల్ దుబాయ్ వేదికగా జరుగనున్నది. లీగ్ మ్యాచ్‌లు షార్జా, అబుదాబి, దుబాయ్‌లలో జరగనున్నాయి. కాగా, టీ20 వరల్డ్ కప్‌ కూడా యూఏఈలో నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే షార్జా, అబుదాబి స్టేడియంలను ఐసీసీకి అప్పగించేందుకు కూడా బీసీసీఐ ఒప్పుకున్నది. అగస్టు చివరి వారంలోగా అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈ తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని బీసీసీఐ సమాచారం ఇవ్వనున్నది. ఈ లోపే విదేశీ ఆటగాళ్లను ఎలా భర్తీ చేయాలనే దానిపై నియమ నిబంధనలు బీసీసఐ విడుదల చేయనున్నది. రాబోయే కొన్ని నెలల పాటు టీమ్ ఇండియా ఆటగాల్లు ఫుల్ బిజీగా ఉండటంతో పాటు.., అభిమానులను కూడా క్రికెట్‌తో ఆలరించనున్నారు.

BCCI has released IPL 2021 New Schedule. According to this new schedule, now IPL 2021 will start on 19 September 2021. The final match of IPL is going to be the most exciting.

Tags:    

Similar News