ఆర్.కృష్ణయ్య సంచలన నిర్ణయం.. సాగర్‌లో వారికే మద్దతు

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియగా.. ఇక ప్రచారానికి సమాయాత్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి దివంగత నేత నోముల నర్సిహయ్య కుమారుడు నోముల భగత్, బీజేపీ నుంచి రవి నాయక్‌లకు బరిలోకి దింపాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ వినూత్న వ్యూహాలు చేస్తోంది. అందులో భాగంగానే బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మద్దతు కోరింది. […]

Update: 2021-04-01 21:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియగా.. ఇక ప్రచారానికి సమాయాత్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి దివంగత నేత నోముల నర్సిహయ్య కుమారుడు నోముల భగత్, బీజేపీ నుంచి రవి నాయక్‌లకు బరిలోకి దింపాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ వినూత్న వ్యూహాలు చేస్తోంది. అందులో భాగంగానే బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మద్దతు కోరింది. దీనికి స్పందించిన ఆర్.కృష్ణయ్య సైతం అనూహత్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. నాగార్జున సాగర్‌ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని తాము చేసిన విజ్ఞప్తిని సీఎం కేసీఆ్‌ పరిగణలోకి తీసుకుని ఉద్యమాల వీరుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు కేటాయించారని తెలిపారు. బీసీలంతా భగత్‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి బీసీల కొత్త చరిత్రకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్.కృష్ణయ్య మద్దతుతో టీఆర్‌ఎస్‌ మరింత బలం చేకూరింది.

Tags:    

Similar News