బీసీ బంధు కావాలి.. మేకపోతుల డిమాండ్

దిశ, మిర్యాలగూడ : అభివృద్ధికి నోచుకోని బీసీకులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు పథకం ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద బీసీ‌లకు ఇంటికి పదిలక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ బిల్లు‌తో బీసీలకు నష్టం కేంద్ర ప్రభుత్వం సవరించిన ఓబీసీ బిల్లు వలన బీసీ‌లకు తీరని నష్టం జరుగుతుందని బీసీ సంక్షేమ […]

Update: 2021-08-14 06:46 GMT
బీసీ బంధు కావాలి.. మేకపోతుల డిమాండ్
  • whatsapp icon

దిశ, మిర్యాలగూడ : అభివృద్ధికి నోచుకోని బీసీకులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు పథకం ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద బీసీ‌లకు ఇంటికి పదిలక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఓబీసీ బిల్లు‌తో బీసీలకు నష్టం

కేంద్ర ప్రభుత్వం సవరించిన ఓబీసీ బిల్లు వలన బీసీ‌లకు తీరని నష్టం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 127వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఇతర కులాన్ని అయినా బీసీ జాబితాలోకి చేర్చే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం ద్వారా బీసీలను బానిసలుగా మారుతారని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీలంతా ఏక తాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రఘు, నవీన్, సాయి, సైదులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News