మహిళలకు తీపి కబురు.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ పండుగను ప్రతీ ఆడబిడ్డ సంతోషంగా జరుపుకోవడంతో పాటు, దశాబ్దాలుగా సరిపడా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. సర్కారు ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్దంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ ఆడబిడ్డకు 18 ఏళ్లు నిండిన వారందరికీ చీరలు అందజేస్తున్నది. సూమారు కోటి 5 లక్షల చీరల(1,05,00,00)ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. […]
దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ పండుగను ప్రతీ ఆడబిడ్డ సంతోషంగా జరుపుకోవడంతో పాటు, దశాబ్దాలుగా సరిపడా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. సర్కారు ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్దంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ ఆడబిడ్డకు 18 ఏళ్లు నిండిన వారందరికీ చీరలు అందజేస్తున్నది.
సూమారు కోటి 5 లక్షల చీరల(1,05,00,00)ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం సూమారు 333 కోట్లు రూపాయలు మంజూరు చేసింది. 225 డిజైన్లు, 25 కలర్లతో ప్రభుత్వం చీరల తయారీని చేపట్టింది. తయారైన చీరలను అధికారులు జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయనున్నారు.
అక్టోబర్ 5 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్ మొదటివారంలోనే చీరలపంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. టెస్కో ఆధ్వర్యంలో చీరలను తయారు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే సిరిసిల్ల పవర్ లూమ్స్‌లో 75లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్‌లో 12 లక్షల చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికే 80 లక్షల చీరలను లేటెస్టు డిజైన్లు, మంచి క్వాలిటీతో తయారు చేశారు.
ఈ చీరలను హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు తరలించారు. హన్మకొండలోని కాకతీయ టెక్స్ టైల్ పార్కు నుంచి కూడా చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సొసైటీలో 366 యూనిట్లు ఉండగా ప్రతీ యూనిట్ నుంచి 8 మిషన్లు ఆధునిక టెక్నాలజీతో కూడినవి ఉన్నాయి. 22.5 లక్షల మీటర్ల చీరలను 25 రంగుల్లో తయారు చేశారు. సిరిసిల్ల నుంచి 60లక్షల చీరలను మూడు నెలల్లో తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు.
అయితే, బీసీ వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ అధికారులు చీరల తయారీని పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ డిజైన్ల నుంచి మహిళా ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పలు చీరలను ఎంపిక చేశారు. మహిళల అభిరుచి మేరకు ఈ బతుకమ్మ చీరల డిజైన్ ఎంపిక జరిగింది. పండగ రోజు మహిళలంతా ఒకే విధంగా కనిపించకుండా సుమారుగా 225 డిజైన్లు, 25 కలర్స్‌లో ఈ చీరలు తయారు అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజింగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో చీరల పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, రేషన్‌షాప్ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు.
బతుకమ్మ చీరలను ఆకర్షణీయమైన రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో, నూరు శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలుతో తయారు చేశారు. వృద్ధ మహిళల కోసం 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరలను తయారు చేశారు. చీరలోనే బ్లౌజ్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదరణ ఉండటంతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని టెస్కో విక్రయ కేంద్రాల్లోనూ వీటిని విక్రయించాలని నిర్ణయించారు. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు చేరవేశామని, పంపిణీ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు టెస్కోకు చెందిన ఓ అధికారి తెలిపారు.
సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్‌లకు చెందిన 26 వేలకుపైగా మరమగ్గాలపై పనిచేస్తున్న సుమారు 10 వేల మంది కార్మికులకు, 5వేల మంది డిజైనర్లు, ఇతర అనుబంధ కార్మికులకు ఉపాధి లభించింది. గతంలో నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం పొందిన కార్మికులు ప్రస్తుతం రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్జిస్తున్నారు.
సంవత్సరం లబ్ధిదారులు ఖర్చు
(రూ.కోట్లలో)
2017 95,48,439 222
2018 96,70,474 280
2019 96,57,813 313
2020 1,00,00,00 317.81
2021 1,05,00,00 333.