పటాన్‌చెరులో ఘనంగా సద్దుల బతుకమ్మ.. రంగులమయమైన సాకి చెరువు

దిశ, పటాన్‌చెరు : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు పట్టణంలో గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాస్యనటుడు బిత్తిరి సత్తి, జానపద కళాకారులు గంగా, కనకవ్వ పాల్గొని సందడి చేశారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, […]

Update: 2021-10-14 11:10 GMT

దిశ, పటాన్‌చెరు : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు పట్టణంలో గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాస్యనటుడు బిత్తిరి సత్తి, జానపద కళాకారులు గంగా, కనకవ్వ పాల్గొని సందడి చేశారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ రమణకుమార్, ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య మహిళలు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు, కళాకారుల ప్రదర్శనతో సాకి చెరువు ప్రాంగణం మార్మోగింది. భారీ, సుందరంగా తయారు చేసిన బతుకమ్మలను ఎంపిక చేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండవ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు నగదుతో పాటు మరో పది మందిని ఎంపిక చేసి పట్టు చీరలను కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. మొత్తానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్ని పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..