తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ : ఎమ్మెల్యే గూడెం

దిశ, పటాన్‌చెరు : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు మండల పరిధిలోని పాశమైలారంలో గ్రామ ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలకు ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని మధు ప్రియ ఆలపించిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ […]

Update: 2021-10-11 21:47 GMT

దిశ, పటాన్‌చెరు : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు మండల పరిధిలోని పాశమైలారంలో గ్రామ ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలకు ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని మధు ప్రియ ఆలపించిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి.

అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగ విశ్వవ్యాపితం అవుతోందన్నారు.

ప్రభుత్వం సూచించిన కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచయ్య, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బి.వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News