ఆ కేసులో బార్క్ మాజీ సీఈవోకు బెయిల్
ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్‌పీ) స్కాం కేసులో అరెస్టయిన బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ. 2 కోట్ల పూచీకత్తు జమ చేయాల్సిందిగా షరతు విధించింది. ప్రతి నెల మొదటి శనివారం ముంబయి క్రైం పోలీసులకు దాస్‌గుప్తా రిపోర్ట్ చేయాలని, ఆరునెలల తర్వాత ప్రతి మూడు నెలలకోసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పాస్‌పోర్టునూ పోలీసులకూ అప్పజెప్పాల్సిందిగా పేర్కొంది. టీఆర్‌పీ స్కాం దర్యాప్తునకు సహకరించాలని జస్టిస్ ప్రకాశ్ నాయక్ తెలిపారు. ఈ […]
ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్‌పీ) స్కాం కేసులో అరెస్టయిన బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ. 2 కోట్ల పూచీకత్తు జమ చేయాల్సిందిగా షరతు విధించింది. ప్రతి నెల మొదటి శనివారం ముంబయి క్రైం పోలీసులకు దాస్‌గుప్తా రిపోర్ట్ చేయాలని, ఆరునెలల తర్వాత ప్రతి మూడు నెలలకోసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పాస్‌పోర్టునూ పోలీసులకూ అప్పజెప్పాల్సిందిగా పేర్కొంది.
టీఆర్‌పీ స్కాం దర్యాప్తునకు సహకరించాలని జస్టిస్ ప్రకాశ్ నాయక్ తెలిపారు. ఈ కేసులో డిసెంబర్ 24న పార్థో దాస్‌గుప్తాను అరెస్టు చేసి తలోజా జైలుకు పంపించారు. టీఆర్‌పీ కేసులో దాదాపు అందరు నిందితులు బెయిల్‌పై బయట ఉన్నారని, గుప్తా కంటే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న బార్క్ మాజీ సీవోవో రోమిల్ రామగడియా బయటే ఉన్నారని గుప్తా తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ఈ కేసు విచారణ ప్రారంభానికి ఇంకా చాలా సమయం పడుతుందని, అప్పటి వరకు పార్థో దాస్‌గుప్తాను కటకటాల వెనక ఉంచడం సరికాదని వాదించారు. ఆయన ఆరోగ్యమూ క్షీణించిందని వివరించారు.