గ్రీన్ ఫైనాన్స్‌తో స్థిరమైన వృద్ధికి అవకాశం : ఎస్‌బీఐ చైర్మన్!
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వృద్ధికి బ్యాంకులు ఎప్పుడూ వెన్నెముకగా ఉంటాయని, దేశం సుస్థిర వృద్ధికి కీలకమైన బ్యాంకింగ్ రంగం పర్యావరణానుకూల పరిశ్రమలకు రుణాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష ఖారా అన్నారు. గురువారం జరిగిన ఈఎస్‌జీ ఇండియా లీడర్‌షిప్ సమావేశంలో పాల్గొన్న ఆయన పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టు(గ్రీన్ ఫైనాన్స్)లకు బ్యాంకులు ఇంకా ఎక్కువ సంఖ్యలో రుణాలను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రీన్ ఫైనాన్స్ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై భారత ఆర్థిక […]
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వృద్ధికి బ్యాంకులు ఎప్పుడూ వెన్నెముకగా ఉంటాయని, దేశం సుస్థిర వృద్ధికి కీలకమైన బ్యాంకింగ్ రంగం పర్యావరణానుకూల పరిశ్రమలకు రుణాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష ఖారా అన్నారు. గురువారం జరిగిన ఈఎస్‌జీ ఇండియా లీడర్‌షిప్ సమావేశంలో పాల్గొన్న ఆయన పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టు(గ్రీన్ ఫైనాన్స్)లకు బ్యాంకులు ఇంకా ఎక్కువ సంఖ్యలో రుణాలను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రీన్ ఫైనాన్స్ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై భారత ఆర్థిక రంగాన్ని చైతన్యం ఉందని దినేష్ ఖారా అభిప్రాయపడ్డారు.
గ్రీన్ ఫైనాన్‌కు సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న విధానాలను పరిశీలించాలన్నారు. ఈ రంగంలోని వ్యక్తుల అభిప్రాయాలను తీసుకొని అందుకు తగిన నిర్వచనం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విభాగంలో తగిన నియంత్రణను ఏర్పాటు చేయడం ద్వారా ఈ రంగంలో మరింత ఆర్థిక స్థిరత్వం ఉంటుందని, తద్వారా ప్రభుత్వం, ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. పర్యావరణ, దానికి సంబంధించిన అంశాలు, నిర్వహణపై ఎస్‌బీఐ చొరవ తీసుకుంటోందన్నారు. 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. దీనికోసం తగిన లక్ష్యాలను నిర్దేశించామన్నారు.
సౌర విద్యుత్ ప్లాంట్ల కోసమే పరిమితం కావట్లేదని, చెట్ల పెంపకం, సింగి యూజ్‌డ్ ప్లాస్టిక్ వాడక నిషేధం, సేంద్రీయ వ్యవసాయాల పురోగతికి కట్టుబడి ఉన్నామన్నారు. వ్యాపార రంగంలో వస్తున్న మార్పులను పరిగణించి వాతావరణానికి అయ్యే నష్టాన్ని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. 2018-19 నుంచి సుమారు రూ. 60 లక్షల కోట్ల విలువైన గ్రీన్ లోన్ బాండ్లు, గ్రీన్ బాండ్లను జారీ చేసింది. వీటి ద్వారా వచ్చే నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల ఖోసం వినియోగిస్తోందని దినేష్ ఖారా వెల్లడించారు.