పెరిగిన ఎన్‌బీఎఫ్‌సీల బ్యాంకు బకాయిలు

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటినుంచో దేశంలోని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(non-banking financial companies) ద్రవ్య లభ్యత (Cash availability) పెంచేందుకు రుణాలివ్వాలని (Loans) నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే వీటికి బ్యాంకుల (Banks) నుంచి రుణాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. 2018, సెప్టెంబర్ నుంచి 2020, జూన్ వరకు లభ్యమైన గణాంకాల (Statistics)ను పరిశీలిస్తే.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (non-banking financial companies) బకాయిలు 8.8 శాతం పెరిగినట్టు కేర్ రేటింగ్ నివేదిక (Care rating report) స్పష్టం […]

Update: 2020-08-15 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటినుంచో దేశంలోని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(non-banking financial companies) ద్రవ్య లభ్యత (Cash availability) పెంచేందుకు రుణాలివ్వాలని (Loans) నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే వీటికి బ్యాంకుల (Banks) నుంచి రుణాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.

2018, సెప్టెంబర్ నుంచి 2020, జూన్ వరకు లభ్యమైన గణాంకాల (Statistics)ను పరిశీలిస్తే.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (non-banking financial companies) బకాయిలు 8.8 శాతం పెరిగినట్టు కేర్ రేటింగ్ నివేదిక (Care rating report) స్పష్టం చేస్తోంది. జూన్ నాటికి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (non-banking financial companies)లకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు 47.1 శాతం పెరిగి రూ. 7.99 లక్షల కోట్లకు చేరాయి.

2018, సెప్టెంబర్ సమయానికి ఈ రుణాలు రూ. 5.47 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే, ఎన్‌బీఎఫ్‌సీ లకు మ్యూచువల్ ఫండ్‌ (Mutual Fund)ల నుంచి రుణాలు తగ్గాయని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి మ్యూచువల్ ఫండ్‌ (Mutual Funds)ల నుంచి ఎన్‌బీఎఫ్‌సీ (non-banking financial companies)ల అప్పులు తగ్గి రూ. 1.34 లక్షల కోట్లకు చేరాయి.

కానీ, మళ్లీ నెల రోజుల వ్యవధిలో కొంతమేరకు పెరిగి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుకున్నట్టు నివేదిక పేర్కొంది. మ్యూచువల్ ఫండ్‌ (Mutual Fund)ల నుంచి ఎన్‌బీఎఫ్‌సీ (non-banking financial companies)లు సమీకరించిన మొత్తం జూన్ నాటికి రూ. 30 వేల కోట్లకు తగ్గాయి. గతేడాది మార్చి సమయానికి ఇవి రూ. 80 వేల కోట్లుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం అనంతరం ఈ కంపెనీలు బ్యాంకుల నుంచి ఎక్కువగా నిధులను సమీకరించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News