"కరోనా" కఠోర సమయంలో కేసీఆరే రక్ష : బండ్ల గణేష్

బండ్ల గణేష్… నటుడు, నిర్మాత. ఆయన మాట్లాడే మాటలు, చేసే హడావిడికి నవ్వొస్తుంది అంటారు జనాలు. ఒకసారి జనసేన అంటాడు… మరోసారి కాంగ్రెస్ అంటాడు.. అని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జై కేసిఆర్ అంటున్నాడు బండ్ల. తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన… లాక్ డౌన్ పొడిగిస్తూ కేసిఆర్ చేసిన ప్రకటనపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం మాకు మీరు […]

Update: 2020-04-12 03:36 GMT

బండ్ల గణేష్… నటుడు, నిర్మాత. ఆయన మాట్లాడే మాటలు, చేసే హడావిడికి నవ్వొస్తుంది అంటారు జనాలు. ఒకసారి జనసేన అంటాడు… మరోసారి కాంగ్రెస్ అంటాడు.. అని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జై కేసిఆర్ అంటున్నాడు బండ్ల. తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన ఆయన… లాక్ డౌన్ పొడిగిస్తూ కేసిఆర్ చేసిన ప్రకటనపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు.

మా క్షేమం కోసం, సమాజం కోసం, మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు బండ్ల గణేష్. నాలుగు రోజులు కాదు సార్ …మీ మీద నమ్మకంతో, మీరు ఉన్నారన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్లకే పరిమితం అవుతాం.. విజయం సాధిస్తామన్నారు.

మీరు చేపట్టే కార్యక్రమాలు, మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ భగవంతుని దయతో జయప్రదం కావాలని… తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని రాజకీయ నాయకులను వేడుకుంటున్నట్లు చెప్పారు. భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలైనా భరిస్తాం… ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తాం… మాకు మీరు ఉన్నారని ధైర్యం… మీరు రక్షిస్తారు అనే నమ్మకం ఉంది… జై కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.

Tags: Bandla Ganesh, Lock Down, KCR, Tollywood, Telangana, CoronaVirus, Covid19

Tags:    

Similar News