నందమూరి నాలుగో తరం వచ్చేసినట్లే…

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోలీ గిఫ్ట్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది. తారక్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్ చేయడంతో అభిమానుల హోలీ సెలబ్రేషన్స్ రెట్టింపయ్యాయి. ఫోటోలో తారక్‌తో పాటు భార్య లక్ష్మీ ప్రణతి, పెద్ద కొడుకు అభయ్ రామ్, చిన్న కొడుకు భార్గవ్ రామ్‌లు కలర్‌పుల్‌గా కనిపించగా… ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు తారక్ చిన్నబ్బాయి భార్గవ్ రామ్ గురించి కూడా ఓ హ్యాష్ ట్యాగ్ […]

Update: 2020-03-11 01:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోలీ గిఫ్ట్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది. తారక్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్ చేయడంతో అభిమానుల హోలీ సెలబ్రేషన్స్ రెట్టింపయ్యాయి. ఫోటోలో తారక్‌తో పాటు భార్య లక్ష్మీ ప్రణతి, పెద్ద కొడుకు అభయ్ రామ్, చిన్న కొడుకు భార్గవ్ రామ్‌లు కలర్‌పుల్‌గా కనిపించగా… ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు తారక్ చిన్నబ్బాయి భార్గవ్ రామ్ గురించి కూడా ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.

ఈ పిక్‌పై డైరెక్టర్ హరీశ్ శంకర్ చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను హోలీ సందర్భంగా రంగుల లోకంలో విహరించేలా చేశాయి. చిన్నోడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెప్తున్నట్లుగా ఉందని… వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు అన్న హరీశ్ శంకర్ ట్వీట్‌తో మురిసిపోయారు. లిటిల్ టైగర్ ఆన్ ద వే అంటూ చేసిన పోస్ట్‌కు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇదిలా ఉంటే నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ ఫోటో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నందమూరి నాలుగో తరానికి ఢోకా లేదని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోలీ సందర్భంగా తేల్చేశాడంటూ పోస్ట్ పెట్టాడు.

tgas:NTR, Young Tiger, Little Tiger, Bhargav Ram, Holi Gift

Tags:    

Similar News