ఇంటెలిజెన్స్‌కూ అందని రీతిలో ఆందోళనలు: బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్: జనగామలో బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ, ఎస్సైని సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం జనగామ వెళ్లిన బండి సంజయ్.. నిన్న లాఠీఛార్జ్‌లో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. 24గంటల్లో సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఏం చేస్తామో కూడా చెప్పమని హెచ్చరించారు. కొంతమంది ఐపీఎస్‌లు బీజేపీ కార్యకర్తలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, మేం […]

Update: 2021-01-13 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనగామలో బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ, ఎస్సైని సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం జనగామ వెళ్లిన బండి సంజయ్.. నిన్న లాఠీఛార్జ్‌లో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. 24గంటల్లో సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఏం చేస్తామో కూడా చెప్పమని హెచ్చరించారు. కొంతమంది ఐపీఎస్‌లు బీజేపీ కార్యకర్తలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, మేం పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలనను అంతం చేస్తామన్న బండి సంజయ్.. ఇంటెలిజెన్స్‌కూ అందని రీతిలో మా ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News