ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి: బండి

దిశ,వెబ్‌డెస్క్: అయోధ్య రామజన్మభూమిలో ఆలయం కోసం దేశ వ్యాప్తంగా నిధి సేకరణ జరగుతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని బోరబండలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షత్ర ట్రస్టు ఆధ్వర్యంలో.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జనజాగరణ ద్వారా నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జానజాగరణ ద్వారా నిధి సేకరణ జరుగుతోందని గుర్తు చేశారు. ప్రతీ హిందువు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం […]

Update: 2021-01-20 00:16 GMT
ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి: బండి
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: అయోధ్య రామజన్మభూమిలో ఆలయం కోసం దేశ వ్యాప్తంగా నిధి సేకరణ జరగుతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని బోరబండలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షత్ర ట్రస్టు ఆధ్వర్యంలో.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జనజాగరణ ద్వారా నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జానజాగరణ ద్వారా నిధి సేకరణ జరుగుతోందని గుర్తు చేశారు.

ప్రతీ హిందువు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదన్న బండి సంజయ్.. అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిర నిర్మాణం కోసమే చేపట్టిన మహోత్తర కార్యక్రమం అని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ హిందువు కూడా రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతోనే నిధి సేకరణ చేపట్టామన్నారు.

Tags:    

Similar News