పేద రైతుల కోసం దీక్షలు చేస్తే భగ్నం చేస్తారా?
దిశ, తెలంగాణ బ్యూరో: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం కొండపెల్లి పేద రైతుల భూముల పరిరక్షణ కోసం బీజేపీ నేతలు చేస్తున్న దీక్షలను పోలీసులు భగ్నం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. పోలీసుల దూకుడు చర్యలతో పాల్వాయి హరీష్ అనే బీజేపీ నేత పక్కటెముకలు విరిగిపోయాయని, మరో నాయకుడుకి తీవ్ర గాయలయ్యాయన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల టీఆర్ఎస్ నేతలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం కొండపెల్లి పేద రైతుల భూముల పరిరక్షణ కోసం బీజేపీ నేతలు చేస్తున్న దీక్షలను పోలీసులు భగ్నం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. పోలీసుల దూకుడు చర్యలతో పాల్వాయి హరీష్ అనే బీజేపీ నేత పక్కటెముకలు విరిగిపోయాయని, మరో నాయకుడుకి తీవ్ర గాయలయ్యాయన్నారు.
హైదరాబాద్ చుట్టు పక్కల టీఆర్ఎస్ నేతలు కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేస్తున్నా పట్టించుకోని సర్కార్… ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పేదల భూములను లాక్కోవాలని చూడడం దారుణమన్నారు. కొండపెల్లి రైతులు తమ భూములను లాక్కోవద్దని మొర పెట్టుకుంటున్నా.. వినకుండా ప్రభుత్వం పోలీసులతో వారిపై దాడులు చేయిస్తోందన్నారు. పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్యం తెలంగాణలో ఉందా? అనే అనుమానం కల్గుతోందన్నారు.