కేసీఆర్ చేతిలో తెలంగాణ తల్లి బందీ అయ్యింది: బండి
దిశ, న్యూస్‌బ్యూరో: కేసీఆర్ ఆరేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మలిదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళవారం హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ ఎంపీ వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతా సాంబమూర్తితో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో కేసీఆర్‌కు అధికారాన్ని అప్పగిస్తే […]
దిశ, న్యూస్‌బ్యూరో: కేసీఆర్ ఆరేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మలిదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళవారం హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ ఎంపీ వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతా సాంబమూర్తితో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో కేసీఆర్‌కు అధికారాన్ని అప్పగిస్తే అబద్దాలు, మోసాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ తల్లి బందీ అయిందని, అమరుల ఆశయాలను తుంగలో తొక్కారని, ఆరేండ్ల పాలనలో సాధించింది అబద్దాల రికార్డులు మాత్రమేనన్నారు. లక్ష ఉద్యోగాలు అని చెప్పి 20వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేక పోయారని, రాష్ట్రంలో విద్య, వైద్య వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతు బంధు ఎగ్గొట్టేందుకు కొత్త కుట్ర చేస్తున్నారని, భూసార పరీక్షలు చేయకుండా తమకు ఇష్టమొచ్చిన పంటలు వేయమనడం సరైన పద్ధతి కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుపడింది కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు ప్రజలు అన్నింటా వంచనకు గురవుతున్నారన్నారు. కమీషన్ల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.