కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి: బండి సంజయ్

దిశ, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం క్వారన్‌టైన్‌లో ఉండి పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగి పోతుండడంతో డాక్టర్లు, పోలీసులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. సోమవారం బండి సంజయ్ నేత‌ృత్వంలో బీజేపీ శ్రేణులు కోఠిలోని డీఎంహెచ్ఎస్‌ ముట్టడికి యత్నించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు.. బండి సంజయ్, ఇతర నాయకులను అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ స్టేషన్‌కు తరలించారు. ఈ […]

Update: 2020-06-22 09:33 GMT

దిశ, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం క్వారన్‌టైన్‌లో ఉండి పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగి పోతుండడంతో డాక్టర్లు, పోలీసులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. సోమవారం బండి సంజయ్ నేత‌ృత్వంలో బీజేపీ శ్రేణులు కోఠిలోని డీఎంహెచ్ఎస్‌ ముట్టడికి యత్నించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు.. బండి సంజయ్, ఇతర నాయకులను అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేదని విమర్శించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలన్నారు. కరోనా కట్టడి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తే.. కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ఆ నిధుల ఖర్చుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. ముఖ్యంగా, కరోనా వైద్య పరీక్షలను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News