ఓడిపోతామని కేసీఆర్‌కు తెలిసిపోయింది.. బండి సంజయ్ చురకలు
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని, అందుకే ఆయన డైరెక్షన్‌లోనే వీవీప్యాట్లను కారులో తరలించుకుపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ఆరోపించారు. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ సమీపంలోని పటేల్ విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీవీప్యాట్లు పనిచేయడంలేదని ఏజెంట్లకు తెలపకుండా ఎలా నిర్ధారించారని అడిగారు. వీవీప్యాట్స్ పనిచేయడం లేదనే సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా కారులో […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని, అందుకే ఆయన డైరెక్షన్‌లోనే వీవీప్యాట్లను కారులో తరలించుకుపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ఆరోపించారు. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ సమీపంలోని పటేల్ విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీవీప్యాట్లు పనిచేయడంలేదని ఏజెంట్లకు తెలపకుండా ఎలా నిర్ధారించారని అడిగారు. వీవీప్యాట్స్ పనిచేయడం లేదనే సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా కారులో ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. వీవీప్యాట్లు తరలించడంపై తమకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కో ఓటుకు రూ.6 నుండి రూ.20 వేల వరకు పంచి ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశారని, ఈ ఘటనతో యావత్తెలంగాణ ప్రజానీకం తలదించుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. టీఆర్ఎస్వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహా ఎదుట నల్లబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.