ఉరేసుకుంటా.. టీడీపీ ముఖ్య నేత సంచలనం!

దిశ, వెబ్ డెస్క్: విశాఖ గీతం యూనివర్సిటీ నిర్మాణాలను జీవీఎంసీ తొలగించడంపై ఏపీలో చర్చనీయాంశం అయింది. అధికార ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కూల్చివేతలకు పూనుకుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ముఖ్య నేత బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రంగా స్పందించారు. 18 కేసులు ఉన్న వ్యక్తి సీఎం అవడం తమ కర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ పేరు పెట్టిన గీతంను కూల్చడం దౌర్భాగ్యమన్నారు. కోవిడ్ సమయంలో గీతం ఆసుపత్రి విశేష […]

Update: 2020-10-24 06:16 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ గీతం యూనివర్సిటీ నిర్మాణాలను జీవీఎంసీ తొలగించడంపై ఏపీలో చర్చనీయాంశం అయింది. అధికార ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కూల్చివేతలకు పూనుకుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ముఖ్య నేత బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రంగా స్పందించారు. 18 కేసులు ఉన్న వ్యక్తి సీఎం అవడం తమ కర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు.

గాంధీ పేరు పెట్టిన గీతంను కూల్చడం దౌర్భాగ్యమన్నారు. కోవిడ్ సమయంలో గీతం ఆసుపత్రి విశేష సేవలందించిందని, కాదని చెప్పండి.. వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా? అని సత్యనారాయణ ప్రశ్నించారు.

Tags:    

Similar News