బ్రేకింగ్ న్యూస్.. ఏసీబీ వలలో బాలానగర్‌ సబ్‌రిజిస్ట్రార్

దిశ, కూకట్‎పల్లి: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్, డాక్యుమెంట్ ​రైటర్​ జియాఉద్దీన్‌లు కుమ్మక్కయ్యారు. ఓ భూమికి సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 75 వేలు లంచం అడిగినట్టు బాధితుడు షేక్ షరీఫ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పథకం వేసి.. సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంట్​ రైటర్ ​జియాఉద్దీన్‌లను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం […]

Update: 2021-09-07 07:37 GMT

దిశ, కూకట్‎పల్లి: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్, డాక్యుమెంట్ ​రైటర్​ జియాఉద్దీన్‌లు కుమ్మక్కయ్యారు. ఓ భూమికి సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 75 వేలు లంచం అడిగినట్టు బాధితుడు షేక్ షరీఫ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పథకం వేసి.. సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంట్​ రైటర్ ​జియాఉద్దీన్‌లను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిజాముద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News