ట్రాఫిక్ ఫ్రీ.. కాసేపట్లో బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్ : నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున గల బాలానగర్‌లో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.387 కోట్ల వ్యయం కాగా, 1.13కిమీ మీటర్ల పొడవుతో ఈ వంతెన రూపుదిద్దుకుంది. 6 లైన్లు, 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లు ఈ ఫ్లై ఓవర్ ప్రత్యేకతలు.. అయితే, ఈ వంతెన అందుబాటులోకి రావడంతో […]

Update: 2021-07-05 22:00 GMT
balanagar-blyover
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున గల బాలానగర్‌లో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నారు.

బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.387 కోట్ల వ్యయం కాగా, 1.13కిమీ మీటర్ల పొడవుతో ఈ వంతెన రూపుదిద్దుకుంది. 6 లైన్లు, 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లు ఈ ఫ్లై ఓవర్ ప్రత్యేకతలు.. అయితే, ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అటు కూకట్ పల్లి, అమీర్ పేట, బోయినపల్లి, జగద్గిరిగుట్ట మీదుగా ప్రయాణించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Tags:    

Similar News