బజాజ్ ఆటో అమ్మకాల్లో వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: 2020, డిసెంబర్ నెలకు సంబంధించి దేశీయ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ మొత్తం అమ్మకాల్లో 11 శాతం వృద్ధితో 3,72,532 యూనిట్లను విక్రయించినట్టు సోమవారం తెలిపింది. 2019, డిసెంబర్ నెలలో కంపెనీ మొత్తం 3,36,055 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. దేశీయ అమ్మకాలు 9 శాతం తగ్గి 1,39,606 యూనిట్లు అమ్ముడవగా, 2019, ఇదే నెలలో 1,53,163 యూనిట్లు అమ్ముడైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇక, మోటార్‌సైకిల్ అమ్మకాలు 2019, డిసెంబర్‌లో 2,84,802 యూనిట్లతో […]
దిశ, వెబ్‌డెస్క్: 2020, డిసెంబర్ నెలకు సంబంధించి దేశీయ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ మొత్తం అమ్మకాల్లో 11 శాతం వృద్ధితో 3,72,532 యూనిట్లను విక్రయించినట్టు సోమవారం తెలిపింది. 2019, డిసెంబర్ నెలలో కంపెనీ మొత్తం 3,36,055 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. దేశీయ అమ్మకాలు 9 శాతం తగ్గి 1,39,606 యూనిట్లు అమ్ముడవగా, 2019, ఇదే నెలలో 1,53,163 యూనిట్లు అమ్ముడైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇక, మోటార్‌సైకిల్ అమ్మకాలు 2019, డిసెంబర్‌లో 2,84,802 యూనిట్లతో పోలిస్తే 2020 డిసెంబర్‌లో 3,38,584 యూనిట్లను విక్రయించి 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులు 27 శాతం పెరిగి 2,32,926 యూనిట్లు నమోదయ్యాయని బజాజ్ ఆటో వెల్లడించింది.